అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయంగా డిమాండ్ పుంజుకోవడంతో శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.1100 వృద్ధి చెంది రూ.72,450 వద్ద నిలిచింది. గురువారం 10 గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.72,3510 వద్ద ముగిసిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 స్వచ్ఛత గల తులం బంగారం ధర రూ.71 వేల నుంచి రూ.72,100లకు చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్ తోపాటు దేశీయంగా జ్యువెల్లర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరకు రెక్కలొచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఔన్స్ ధర 5.60 డాలర్ల వృద్ధితో 2468.90 డాలర్లు పలికింది. ఔన్స్ సిల్వర్ ధర మాత్రం స్వల్పంగా తగ్గి 27.60 డాలర్లకు చేరుకున్నది. వచ్చే వారం వెలువడే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలను సునిశితంగా పరిశీలించాలని ఇన్వెస్టర్లకు ఎల్కేపీ సెక్యూరిటీస్ కమొడిటీస్ అండ్ కరెన్సీ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు.
0 Comments