అమెరికా అధ్యక్ష పీఠంపై పోల్ సర్వేలు ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికల్లో ఎవరిని గెలుపు వరిస్తుందని ప్రపంచమంతా ఎదురుచూస్తున్న వేళ పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత సీబీఎస్ న్యూస్ విడుదల చేసిన పోల్ సర్వే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్‌పై మరింత ఉత్కంఠ పెంచుతోంది. ప్రస్తుత ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నట్టు వెల్లడించింది సీబీఎస్ సర్వే. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం పోటాపోటీ ఉండనున్నట్టు తెలిపింది. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా ఇద్దరు అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు విజయావకాశాలు మెరుగయ్యాయి. భారీ మొత్తంలో విరాళాలు కూడా వచ్చాయి. ఆమె సభలకు కూడా మంచి స్పందన లభిస్తోందని సీబీఎస్ సర్వే వెల్లడించింది. గత నెలలో ట్రంప్‌పై దాడి నేపథ్యంలో ఆయనకు విజయావకాశాలు పెరగగా అనంతరం ఆయన హారిస్‌పై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.
0 Comments