Ad Code

స్వర్ణం లేకుండానే వెనుదిరిగిన భారత్ బృందం !


పారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ ప్రస్థానం ముగిసింది. నిన్న రెజ్లర్ రీతికా హుడా మ్యాచ్‌ను చేజార్చుకొని పోటీ నుంచి నిష్ర్కమించడంతో భారత అథ్లెట్లు ఆడాల్సిన అన్ని క్రీడలు ముగిశాయి. దీంతో ఈ ఒలింపిక్స్‌లో స్వర్ణం లేకుండానే భారత్ తిరుగుముఖం పట్టినట్టు అయ్యింది. ఒక రజతం, ఐదు కాంస్యాలు మాత్రమే సాధించడంతో పతకాల పట్టికలో బాగా వెనుకబడింది. ప్రస్తుతానికి 70వ స్థానంలో నిలిచింది. అయితే చివరి రోజైన ఆదివారం పలు ముఖ్యమైన ఈవెంట్లు జరగనున్నాయి. అన్ని క్రీడలు పూర్తయ్యే సరికి భారత్ స్థానం మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. కాగా 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్‌లో భారత్ 7 పతకాలను సాధించిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్ గేమ్స్ ఈరోజు ముగియనున్నాయి. నేటి షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu