Ad Code

తగ్గిన వెండి, బంగారం ధరలు !


నెల ప్రారంభం నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు వరుసగా రెండోరోజు తగ్గాయి. నిన్న 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 220 తగ్గగా, ఇవాళ రూ. 380 తగ్గింది. దీంతో రెండు రోజుల్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.600 తగ్గుదల చోటు చేసుకుంది. మరోవైపు వెండి ధరసైతం తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,200. ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,250 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,350. ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,100 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,200. చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,700 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,850కు చేరింది.


Post a Comment

0 Comments

Close Menu