Ad Code

గుండెపోటుతో క్లాస్ రూమ్ ముందే కుప్పకూలిన విద్యార్థి !


రాజస్థాన్ లోని  దౌసాలో పదవ తరగతి చదువుతున్న యతేంద్ర ఉపాధ్యాయ్‌ (16) గుండెపోటుకి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయి కన్నుమూశాడు. చనిపోవడానికి ముందు రోజే పుట్టిన రోజు చేసుకోవడం అందరి హృదయాలను కలచి వేస్తుంది. కొంత కాలంగా ఆ విద్యార్థి గుండె జబ్బుతో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న పవన్ జర్వాల్ అనే డాక్టర్ మాట్లాడుతూ..'యతేంద్ర అనే విద్యార్థిని స్కూల్ యాజమాన్యం ఆస్పత్రికి తీసుకువచ్చారు. మేం సీపీఆర్ చేశాము.. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే ఆ విద్యార్థి కన్నుమూశాడు.. మేం ఏం చేయలేకపోయాం' ఈ మధ్య చిన్న వయసు వాళ్లకు కూడా హార్ట్ ఎటాక్ వస్తుంది. అందుకే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాని అన్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ యతేంద్ర ఉపాధ్యాయ్‌ కి మూడు సంవత్సరాల క్రితం గుండె సంబంధిత సమస్య ఉందని, ఇలా హఠాత్తుగా కన్నుమూస్తాడని ఊహించలేకపోయామని కన్నీరు పెట్టుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేసేందుకు కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. పోలీసులు సదరు విద్యార్థి మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రస్తుతం విద్యార్థి క్లాస్ రూమ్ ముందే కుప్పకూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu