హమాస్ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఖాన్ యూనిస్ ప్రాంతంపై జరిపిన భీకర వైమానిక దాడుల్లో 71 మంది మృతి చెందారు. మరో 289 మందికి గాయాలైనట్లు గాజా ఆరోగ్య విభాగం వెల్లడించింది. హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్, మరో కీలక కమాండర్ రఫా సలామాలే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఖాన్ యూనిస్‌లోని అల్-మువాసీలో తాజా దాడులు జరిగినట్లు గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. ఉత్తర రఫా నుంచి ఖాన్ యూనిస్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం వేలాదిమంది పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్నారని వెల్లడించింది. ఇజ్రాయెల్ సైన్యమే గతంలో ఈ ప్రాంతాన్ని సేఫ్ జోన్‌గా గుర్తించి, నిరాశ్రయులు అక్కడే ఆశ్రయం పొందాలని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. గత ఏడాది ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడుల వెనుక ప్రధాన సూత్రధారి మహమ్మద్ డెయిఫేనన్న వాదనలు ఉన్నాయి.
0 Comments