మధ్యప్రదేశ్‌లో ఓ విద్యార్థుల గుంపు రెచ్చిపోయింది. ఏకంగా కోచింగ్ సెంటర్‌లోకి ప్రవేశించి గణిత ఉపాధ్యాయుడ్ని బెదిరింపులకు దిగారు. టీచర్ కూడా వారిని ధీటుగానే ఎదుర్కొన్నాడు. ప్రతి దాడిలో టీచర్‌కు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు క్లాస్ రూమ్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సందీప్ శుక్లా అనే వ్యక్తి గణితశాస్త్ర ఉపాధ్యాయుడు. మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు సందీప్ క్లాస్ నిర్వహిస్తున్నాడు. ఇంతలో ముగ్గురు కుర్రాళ్లు ముఖాలకు ముసుగులు ధరించి బయటకు రావాలని బెదిరింపులకు పాల్పడ్డారు. చొక్కా కాలర్ పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. ఇంతలో అక్కడే ఉన్న రాడ్‌ను సందీప్ తీసుకుని.. దుండగులపై దాడి చేశారు. ప్రతి ఘటనలో రాడ్ కింద పడిపోవడంతో నిందితులు తీసుకుని ఎటాక్ చేశారు. కోచింగ్ సెంటర్ బయట జనాలు చూసిన దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. టీచర్‌పై దాడి చేసింది పాత స్టూడెంట్‌గా గుర్తించారు. ఒక విద్యార్థినిపై దాడి చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అతడ్ని క్లాస్ నుంచి సందీప్ బహిష్కరించాడు. దీన్ని మనసులో కక్ష పెంచుకుని స్నేహితుల్ని వెంటేసుకుని దాడికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ తీసుకుని టీచర్ సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. అయితే దాడి జరుగుతున్నప్పుడు క్లాస్‌లో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
0 Comments