Ad Code

రైలు ఢీకొని ట్రాక్‌పైనే విలవిలలాడుతూ ఏనుగు మృతి !


సోంలో రైలు ఢీకొని ట్రాక్ పై ఓ ఏనుగు నరకయాతన అనుభవించి అక్కడే  ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జులై 10వ తేదీన సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంచన్ జంగ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడం వల్ల ఏనుగుకి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే ట్రాక్ పై అటూ ఇటూ తిరుగుతుండగా ఉన్నట్టుండి రైలు వచ్చి బలంగా ఢీకొట్టింది. అప్పటికే బ్రేక్ వేసేందుకు లోకోపైలట్ ప్రయత్నించాడు. అయినా ట్రైన్ స్పీడ్ కంట్రోల్ కాలేదు. బలంగా ఏనుగుని ఢీకొట్టింది.  ట్రైన్ లోని ఓ ప్రయాణికుడు ఏనుగుని వీడియో తీశాడు. అడుగు తీసి అడుగు వేయలేక చాలా ఇబ్బంది పడింది. దాదాపు రెండు నిముషాల పాటు కొన ఊపిరితో కొట్టుమిట్టాడింది. తరవాత ట్రాక్ పక్కనే సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు విడిచింది. ట్రైన్ ఢీకొట్టడం వల్ల కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావమైంది. విపరీతమైన నొప్పితో గట్టిగా హుంకరించింది. ఎలాగోలా ట్రాక్ దాటి అక్కడి నుంచి బయటపడాలని చూసింది. ఓ రెండు అడుగులు వేసి అక్కడే నిలిచిపోయింది. పట్టుతప్పి కింద పడిపోయింది. కాసేపటికే ప్రాణాలు కోల్పోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం అందించి ఉంటే ఏనుగు బతికి ఉండేదేమో అని చాలా మంది కామెంట్స్ పెట్టారు. అయితే అధికారులు ప్రాణం కాపాడేందుకు చికిత్స అందించారు. అయినా ఏనుగు మృతి చెందింది. 

Post a Comment

0 Comments

Close Menu