మధ్యప్రదేశ్‌లో అమర్‌కంటక్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్ కింది భాగంలో మంటలు చెలరేగాయి. రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ రైలు భోపాల్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు వెళ్తోంది. భోపాల్‌లోని మిస్రోడ్ మరియు మండిదీప్ స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. అయితే సకాలంలో మంటలను అదుపు చేశారు. రైలులోని బీ-3, బీ-4 ఏసీ కోచ్‌ల కింద మంటలు చెలరేగాయి. రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పారు. క్షుణ్ణంగా విచారించిన అనంతరం ఉద్యోగులు మళ్లీ రైలును ముందుకు పంపించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. సకాలంలో మంటలను అదుపు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే అనేక రైలు ప్రమాదాలు వెలుగులోకి రావడం గమనార్హం. కొంతకాలం క్రితం జబల్‌పూర్-ఇటార్సీ మధ్య పూణె దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌పై విద్యుత్ వైరు పడింది. లోకో పైలట్ తెలివిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
0 Comments