Ad Code

ఆంధ్రప్రదేశ్ సీఎంవో చీఫ్ సెక్యూరిటీ అధికారిగా డీఎస్పీ యశ్వంత్ !


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారిగా జమ్మలమడుగు డీఎస్పీ యశ్వంత్‌ను ప్రభుత్వం నియమించింది. సార్వత్రిక ఎన్నికల ముందు జమ్మలమడుగు డీఎస్పీగా యశ్వంత్ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలు నిక్కచ్చిగా జరిపారని యశ్వంత్ పేరు పొందారు. నిజాయితీగా విధులు నిర్వహించడంతో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యశ్వంత్ గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు, ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి, తిరుపతి వెస్ట్, జమ్మలమడుగు సబ్ డివిజన్లకు డీఎస్పీగా పని చేశారు. ఈయన డీఎస్పీగా పని చేసిన పలు ప్రాంతాల్లో బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు. ముఖ్యంగా పుత్తూరు డీఎస్పీగా పని చేసిన సమయంలో ఎర్రచందనం స్మగ్లర్లను చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలోనే సమస్యాత్మకంగా పేరొందిన జమ్మలమడుగు సబ్ డివిజనలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తించారు. దీంతో ఆయన పోలీసు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా పొందారు.

Post a Comment

0 Comments

Close Menu