బీహార్‌పై నిర్మలా సీతారామన్ నిధుల వర్షం కురిపించారు. ఆ రాష్ట్రంలోని వివిధ రోడ్ ప్రాజెక్టులకు రు.26,000 కోట్లు కేటాయించారు. వరదల నియంత్రణకోసం రు.11,500 కోట్లు ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పిర్‌పైంటిలో 2,400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని రు.21,400 కోట్లతో నెలకొల్పుతామని ప్రకటించారు. గయలో పారిశ్రామికవాడను నెలకొల్పుతామని చెప్పారు. గయలోని విష్ణుపాద దేవాలయాన్ని, బోధ్ గయలోని మహాబోధి దేవాలయాన్ని కాశీ విశ్వనాథ దేవాలయం తరహాలో ప్రపంచ స్థాయి వారసత్వ సంపద కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. నలంద విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించటంతోపాటు, నలందను పర్యాటక కేంద్రంగా మారుస్తామని చెప్పారు.
0 Comments