అమెరికాలో వడ్డీ రేటు కోతలపై అంచనాలు బలపడడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి రేటు భారీగా పెరిగింది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,417 డాలర్ల వద్ద ఉంది. దేశంలో ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 380 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 350 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 290 రూపాయల చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు 200 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 74,020 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 67,850 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 55,520 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో ₹ 99,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 74,020 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 67,850 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 55,520 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 99,500 గా ఉంది. విశాఖపట్నం మార్కెట్లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
0 Comments