Ad Code

అమెజాన్ అడవుల్లో సంచరించే అరుదైన తెగ !


మెజాన్ అడవుల్లో చాలా తెగలు బయట ప్రపంచం అంటే తెలియకుండా బతుకుతున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించే ఓ అరుదైన తెగ కెమెరాలకు చిక్కారు. దీంతో వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. పెరువియన్ అమెజాన్‌లో సంచరిస్తున్న ఈ తెగను మాష్కో పైరో అని పిలుస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ వీరి వివరాలను, వీడియోలను రిలీజ్ చేశారు. బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ గిరిజన తెగ కేవలం అడవుల్లోనే జీవిస్తున్నట్లు చెప్పారు. పెరు దేశం దగ్గర్లోని లాస్ పీడ్రాస్ రివర్ సమీపంలో ఈ తెగ జీవిస్తున్నట్లు చెప్పారు. వీరిని మాస్కో పైరులు అంటారని, ఇన్నాళ్లు వారు అక్కడ ఉన్నారా లేదా అనే అనుమానం ఉండేదని ఇప్పుడు వారు అక్కడే ఉంటున్నట్లు సాక్ష్యాలు లభించినట్లు స్థానిక దేశీయ సంస్థ పెనామడ్ అధ్యక్షుడు ఆల్ఫ్రెడో వర్గాస్ పియో తెలిపారు. ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొన్ని లాంగింగ్ కంపెనీలు ఆ ప్రాంతాన్ని విక్రయించందని ఆరోపించారు. ఆహారాన్ని వెతికే క్రమంలో ఈ తెగ కెమెరాలకు చిక్కినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మోంటే సాల్వడో, ప్యూర్టో న్యూవో సమీపంలో మారుగ్రామాలు ఉన్నాయని, వీరు బయటకు రావడంతో ఇరు వర్గాల మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉన్నట్లు పియో భావిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu