Ad Code

వందేభారత్‌ భోజనంలోని పప్పులో బొద్దింక ?


వందేభారత్‌లో ప్రయాణించిన దంపతులకు చేదు అనుభవం ఎదురైంది పప్పులో బొద్దింక రావడంతో షాక్‌కి గురయ్యారు. ''భోపాల్‌ నుంచి ఆగ్రాకు వందేభారత్‌ రైల్లో మా అత్త, మామయ్య ప్రయాణించారు. రైల్వే సిబ్బంది తీసుకొచ్చిన భోజనంలో వడ్డించిన పప్పులో బొద్దింక రావడంతో షాక్‌కి గురయ్యారు. ప్రయాణికుల ఆరోగ్య సమస్యలపై రైల్వేశాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. క్యాటరింగ్‌ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలి'' అని ఓ వ్యక్తి 'ఎక్స్‌' వేదికగా రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ అధికార ఖాతాను కూడా ట్యాగ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నాసిరకం భోజనంపై వచ్చిన ఫిర్యాదుకు ఐఆర్‌సీటీసీ స్పందించింది. ''ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. అందుకు క్షమాపణలు కోరుతున్నాం. ఈ విషయంలో సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్‌పై చర్యలు చేపడతాం. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటాం'' అని హామీ ఇచ్చింది. వందేభారత్‌లో గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. ఆహారం నుంచి దుర్వాసన, పెరుగులో ఫంగస్‌ కనిపించడం చర్చకు దారి తీసింది.

Post a Comment

0 Comments

Close Menu