వైద్య చికిత్స కోసం వచ్చే బంగ్లా దేశీయులకు ఈ -వీసా సదుపాయం కల్పించనున్నారు. ఇందుకోసం రంగ్‌పూర్‌లో కొత్తగా అసిస్టెంట్ హై కమి షన్ కార్యాలయాన్ని భారత సర్కారు ప్రారంభించనున్నది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌హసీనాతో జరిగిన భేటీలో ప్రధాని మోడీ కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. మోడీ సర్కారు మూడోసారి కొలువు తీరాక తొలిసారిగా షేక్ హసీనా భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆమెకు శనివారం ఘన స్వాగతం లభించింది. అనంతరం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో మోడీతో హసీనా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరి మధ్య విస్తృతంగా చర్చ జరిగింది. రక్షణ, వాణిజ్య ఒప్పందాలపై ప్రధానంగా చర్చించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ)పై చర్చలు ప్రారంభించడానికి భారత్, బంగ్లాదేశ్ అంగీక రించాయి. కీలక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరుపక్షాలు పది ఒప్పందాలపై సంతకాలు చేశాయని అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్‌తో సంబంధాలకే అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. భారత్‌తో బంగ్లాదేశ్ అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని అన్నారు. హసీనాతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ- మెడికల్ వీసా, రంగ్‌పూర్‌లో కొత్త రాయబార కార్యాలయంతో బంగ్లాదేశ్‌లోని వాయవ్య ప్రాంత ప్రజలు సులువుగా భారత్‌కు వచ్చి చికిత్స పొందే వీలుంటుందని చెప్పారు. ఇరు దేశాల సరిహద్దుల్లో టెర్రరిస్ట్ కార్యకలాపాలను అడ్డుకోవడంతోపాటు శాంతిస్థాపనకు కృషిచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. రక్షణ ఉత్పత్తి, సాయుధ బలగాల ఆధునికీకరణతో సహా రక్షణ సహకారాన్ని పెంపొందించడంపై విస్తృతంగా చర్చించినట్టు మోదీ తెలిపారు. బిమ్స్టెక్తోపాటు ఇతర అంతర్జాతీయ ఫోరంల విషయంలోనూ ఇదే సహకారాన్ని కొనసాగిస్తామని చెప్పారు. బంగ్లాదేశ్‌లోని తీస్తానది పరిరక్షణ, నిర్వహణపై చర్చల కోసం త్వరలో భారత సాంకేతిక బృందం బంగ్లాదేశ్‌ను సందర్శిస్తుందని మోడీ చెప్పారు. కొన్ని మార్పులతో 1996 నాటి గంగా జలాల ఒప్పందాన్ని కొనసాగిస్తామన్నారు. కాగా, భారత్ తమకు విశ్వసనీయమైన స్నేహితుడని బంగ్లా ప్రధాని హసీనా చెప్పారు. ఢిల్లీతో సంబంధాలకు తాము ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.
0 Comments