భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు ఈ నెల 21తో ముగిసిన వారానికి 816 మిలియన్ డాలర్లు వృద్ధి చెంది 653.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 14తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.92 బిలియన్ డాలర్లు తగ్గి 652.9 బిలియన్ డాలర్లతో సరి పెట్టుకున్నాయి. ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్ సీఏ'స్) 106 మిలియన్ డాలర్లు పడిపోయి 574.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం రిజర్వు నిల్వలు 988 మిలియన్ డాలర్లు పెరిగి 56.95 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడ్డాయి. ఎస్డీఆర్స్ 57 మిలియన్ డాలర్లు తగ్గి 18.04 బిలియన్ డాలర్ల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో ఫారెక్స్ రిజర్వు నిల్వలు 9 మిలియన్ డాలర్లు తగ్గి 4.57 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు ఈ నెల ఏడో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 430 కోట్ల డాలర్లు వృద్ధితో 655.8 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో తొలిసారి ఫారెక్స్ రిజర్వు నిల్వలు జీవిత కాల గరిష్టాన్ని తాకాయి.
0 Comments