Ad Code

ఢిల్లీ వేదికగా తెలంగాణ పీసీసీ చీఫ్‌పై కీలక సమావేశం ?


తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై కసరత్తు జరుగుతుంది. అందుకోసం  ఆ క్రమంలో ఢిల్లీలో అందుబాటులో ఉండాలని కీలక నేతలను ఇప్పటికే ఏఐసీసీ ఆదేశించింది. దీంతో కొత్తగూడెం పర్యటనను వాయిదా వేసుకుని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురవారం ఢిల్లీకి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తన ఢిల్లీ పర్యటన ముగించుకుని ఈ రోజు హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే ఆయన సైతం ఈ రోజు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇక పీసీసీ అధ్యక్ష పదవితోపాటు పలువురు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వారంతా ఢిల్లీలోనే పడిగాపులు కాస్తున్నారు. పీసీసీ పదవి కోసం ఈ రోజు పార్లమెంట్ హాల్‌లో పార్టీ అగ్రనేత సోనియా గాంధీని మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కీ వేర్వేరుగా కలిసి.. తన మనస్సులోని మాటను ఆమెకు తెలియజేశారు. మరోవైపు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అయితే ఆయన పీసీసీ అధ్యక్ష పదవి నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ పగ్గాలు ఎవరికి అప్పగించాలనే అంశంపై పార్టీ అధిష్టానం ఈ రోజు భేటీ అవుతుంది. ఆ క్రమంలో సామాజిక సమీకరణాలతోపాటు సీనియారిటీ, సమర్థవంతమైన నాయకుడికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu