Ad Code

సత్యేందర్‌ జైన్‌ బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోండి !


నీలాండరింగ్‌ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్‌ జైన్‌ బెయిల్‌ పిటిషన్‌ను అనవసరంగా వాయిదా వేయకుండా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. కాగా తన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు ఆరువారాలు వాయిదా వేయడాన్ని సవాల్‌ చేస్తూ సత్యేందర్‌ జైన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, ఎస్వీఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం బెయిల్‌ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయొద్దని, తదుపరి విచారణ తేదీ అయిన జులై 9న పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. అయితే సుప్రీంకోర్టులో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఇలాంటి కేసుతో తన పిటిషన్‌ను ట్యాగ్ చేయాలన్న జైన్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

Post a Comment

0 Comments

Close Menu