తెలంగాణలోని జయశంకర్ భూపాలిపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్‌పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్‌లో బుధవారం సీఎస్‌ఎంఆర్‌ఎస్(సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) నిపుణుల బృందం పర్యటించింది. సీఎస్‌ఎంఆర్‌ఎస్, సీడబ్యూపీఆర్‌సీ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్) నిపుణుల బృందాలతో బరాజ్ పనితీరు లోపాలపై అధ్యయం చేయడానికి ప్రభుత్వం ఇటీవల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బరాజ్‌లో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని 19, 20, 21 పియర్లను సీఎస్‌ఎంఆర్‌ఎస్ నిపుణుల బృందం పరిశీలించింది. బరాజ్ అప్‌స్టీమ్, డౌన్ స్టీమ్ పరిస్థితిని వీక్షించారు. ఎన్‌డీఎస్‌ఎస్ సూచనల మేరకు బరాజ్ వద్ద జరుగుతున్న మరమ్మతు, గ్రౌటింగ్ పనులను పరిశీలించారు. కుంగుబాటుకు గల కారణాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు పలు రకాల పరీక్షల కోసం శాంపిల్స్‌ను(Samples collected) సేకరించారు. బరాజ్‌లో జరుగుతున్న పనుల గురించి భారీ నీటిపారుదల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఈఈ తిరుపతి రావు పాల్గొన్నారు.
0 Comments