Ad Code

యాలకులు నీరు - ఆరోగ్య ప్రయోజనాలు !


యాలకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. యాలకుల ను టీలో గాని,  నీళ్ల లో గాని వేసి మరిగించి తీసుకోవటం వలన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.  యాలకులో విటమిన్లు, విటమిన్ సి, ఖనిజాలు, ఐరన్, మాంగనీస్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మైసిన్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. యాలకుల నీరు శరీరంలో పేరుకుపోయినటువంటి అధిక కొవ్వు ను కూడా కరిగిస్తుంది. ఇది బరువు ను తగ్గించడంలో కూడా ఎంతో బాగా సహాయం చేస్తుంది. యలకుల నీటిని ప్రతిరోజు తీసుకోవడం వలన జలుబు, గొంతు నొప్పి లాంటి సమస్యల నుండి బయటపడవచ్చు. ప్రతి రోజు ఒక గ్లాసు యాలకుల నీటిని తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. యాలకుల లో విటమిన్ సి అనేది అధిక మోతాదులో ఉంటుంది. యాలకుల నీటిని తీసుకోవటం వలన జీర్ణ వ్యవస్థ అనేది కూడా ఎంతో బలంగా తయారవుతుంది. అంతేకాక కడుపు నొప్పి సమస్యలను నుండి కూడా ఉపశమనం పొందడంతో పాటుగా శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి ని కూడా పెంచుతుంది. యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెపోటు ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. యాలకులను డిప్రెషన్ తో పోరాడే ఒక ప్రత్యేక సామర్థ్యం కలిగి ఉన్నది. గ్లాస్ నీటిలో యాలకుల పౌడర్ ను వేసుకొని తాగటం వలన మానసిక ఆరోగ్యం ఎంతో బాగా మెరుగుపడుతుంది. ఈ యాలకులు ఆస్తమాను నియంత్రించడంలో కూడా చాలా బాగా మేలు చేస్తాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు యాలకుల నీటిని తాగటం చాలా మంచిది. దీనిని ప్రతినిత్యం తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధించిన సమస్యల నుండి కూడా వెంటనే ఉపశమనం పొందొచ్చు. యాలకులలో బలమైన యాంటీ మైక్రో బయల్ అనే లక్షణాలు ఉన్నాయి. ఇది మంచి దంత పరిశుభ్రతతో పాటు నోటి దుర్వాసనను కూడా శాశ్వతంగా నియత్రించడంలో ఎంతో బాగా సహాయం చేస్తుంది. యాలకులలో లభించే ఫైటో కెమికల్ దుర్వాసనను,బ్యాక్టీరియాని చంపేసి కావిటిస్ మరియు దంతక్షయాన్ని కూడా నిరోధించేందుకు ఎంతో శక్తివంతమైన క్రీమినాశకంగా కూడా పని చేస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu