Ad Code

జీ7 దేశాల వార్షిక సదస్సుకు ప్రధాని మోడీ !


టలీలో జరగబోయే జీ7 దేశాల వార్షిక సదస్సులో  ప్రధాని మోడీ పాల్గొన నున్నారు. కేంద్రంలో వరుసగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ వెళ్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఇటలీలోని బోర్గో ఎగ్నాలజియా ప్రాంతంలోని ఓ లగ్జరీ రిసార్ట్‌లో జూన్ 13-15 తేదీల్లో జీ7 దేశాల సదస్సు జరగనుంది. అమెరికా, ఫ్రాన్స్ అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మాన్యేయేల్ మెక్రాన్.. జపాన్ , కెనడా ప్రధానులు పులియో కిషిదా, జస్టిన్ ట్రూడో తదితర నేతలు సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సమావేశం కోసం జూన్ 13న ప్రధాని ఇటలీ వెళ్లి.. 14వ తేదీన రాత్రికి తిరిగి స్వదేశానికి రానున్నట్లు సమాచారం. అయితే దీనిపై కేంద్రం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రధాని వెంట కేంద్ర విదేశాంగ ప్రధాని ఎస్. జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ తదితర ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu