హాంకాంగ్, షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఎస్బీసీ ) కొన్ని కార్డు సంబంధిత సూచనలను పాటించనందుకు 29.6 లక్షల రూపాయల పెనాల్టీని విధించినట్లు ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. బ్యాంకుల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, రూపే డినోమినేటెడ్ కో-బ్రాండెడ్ ప్రీపెయిడ్ కార్డ్ కార్యకలాపాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేసిన కొన్ని సూచనలను పాటించనందుకు ఈ భారీ పెనాల్టీ విధించినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్‌బీఐ సూచనలను పాటించడం.. దానికి సంబంధించిన సంబంధిత కరస్పాండెన్స్‌ల పర్యవేక్షక నిర్ధారణల ఆధారంగా బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. ఎందుకు నిబంధనలు పాటించలేదో తెలపాలని హెచ్ఎస్ బీసీకి ఆర్బీఐ వివరణ అడిగింది. దీంతో స్పందించిన బ్యాంకు వ్యక్తిగత విచారణ సమయంలో తమ వాదనలు వినిపించింది. అదనపు సమర్పణలను పరిశీలించిన ఆర్‌బీఐ హెచ్ఎస్ బీసీపై ఆరోపణలు నిజమని గుర్తించి.. ద్రవ్య పెనాల్టీ విధించింది. నిర్దిష్ట క్రెడిట్ కార్డ్ ఖాతాలలో కనీస చెల్లింపు బకాయిలను గణించేటప్పుడు ప్రతికూల రుణ విమోచన లేదని నిర్ధారించుకోవడంలో బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. అయితే ఆర్‌బీఐ, పెనాల్టీ చట్టబద్ధమైన మరియు రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉంటుంది. హెచ్ఎస్ బీసీ తమ కస్టమర్‌లతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీలు లేదా ఒప్పందం చెల్లుబాటుపై వివరణ ఇవ్వాలేదని తెలిపింది.
0 Comments