Ad Code

ఏడారిలో అప్పడం కాల్చిన జవాన్ !


త్తరాది రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్ లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్ లో ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలిపేందుకు ఓ జవాన్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ జవాన్ రాజస్థాన్ లో భారీ ఉష్ణోగ్రతలు ఉన్నాయని చెప్పడానికి ఏడారిలో అప్పడాన్ని కాల్చి చూపించాడు. ఏడారిలోని ఇసుకలో అప్పడం ఉంచాడు. దాని కాస్త ఇసుక పోశాడు. కాసేపు ఆగి అప్పడం బయటకు తీశాడు. అప్పటికే అప్పడం కాలింది. తినడానికి అనువుగా మారింది. అంత భారీ ఉష్ణోగ్రతలు ఉన్న జవాన్ దేశం కోసం పని చేస్తున్నాడు. ఆ ఎండలో కూడా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. ఎండలు ఏ విధంగా ఉన్నాయో తెలపడానికి మాత్రమే వీడియో చేశాడు. సాధారణంగా ఎండ తీవ్ర చెప్పేందుకు కోడి గుడ్డు పగల గొట్టి అమ్లెట్ వేస్తారు. అయితే ఇసుకలో ఇది సాధ్యం కాదు కాబట్టి జవాన్ పాపడ్ ను కాల్చిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Post a Comment

0 Comments

Close Menu