మహారాష్ట్రలోని సోలాపుర్ కు చెందిన జిల్లా జడ్జికి 'నేను ముంబై హైకోర్టు న్యాయమూర్తిని, నాకు ఒక రూ.50 వేలు పంపండి. సాయంత్రం వరకూ మళ్లీ ఇస్తానంటూ ' అంటూ ఓ వాట్సప్ మెసేజ్ వచ్చింది. వాట్సప్ డీపీలో న్యాయమూర్తి ఫొటో ఉండటంతో నిజమేనని నమ్మిన జిల్లా జడ్జి డబ్బును ఆ నెంబర్ కు పంపించారు. ఈ క్రమంలోనే ఆగంతకుడి నుంచి పలుమార్లు ఫోన్లు రాగా, అనుమానం వచ్చిన జడ్జి, హైకోర్టు రిజిస్ట్రార్ ను సంప్రదించారు. దీంతో అసలు విషయం బయట పడింది. అసలు ఆయన ఎవరిని డబ్బు అడగలేదని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన జడ్జి స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.
0 Comments