Ad Code

బైక్ చెట్టును ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి !


త్తీస్ గఢ్ లోని రాయ్ గఢ్ జిల్లాలో వేగంగా వచ్చిన బైక్ చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. శనివారం రాత్రి లైలుంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రహన్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతులు ఖులే పైక్రా, విజయ్ సన్వారా(18), లక్ష్మణ్ చౌహాన్ (22)గా గుర్తించారు. వీరు ఓ వివాహానికి హాజరయ్యేందుకు గెరుపాని గ్రామానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. బైక్ ను పైక్రా నడుపుతున్నాడని అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో వారు మరణించినట్లు తెలిపారు. వీరంతా సుబ్ర గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం లైలుంగాలోని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu