Ad Code

ఈమెయిల్‌తో వాట్సాప్‌ లాగిన్ ?


వాట్సాప్ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ప్రత్యేకించి ఐఓఎస్ వాట్సాప్ యూజర్లు తమ ఈ-మెయిల్ అడ్రస్ ఉపయోగించి వాట్సాప్ అకౌంట్లను లింక్ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ ఈ కొత్త అప్‌డేట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం యూజర్లు తమ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి వారి అకౌంట్లలో లాగిన్ అవ్వడానికి అనుమతిస్తుంది. ఈ-మెయిల్ అడ్రస్ లింక్ చేయడం ద్వారా వాట్సాప్‌కు అదనపు యాక్సెస్‌ను పొందవచ్చు. మీరు లింక్ చేసిన ఈ-మెయిల్ అడ్రస్ కాంటాక్టులకు కనిపించవు. వాట్సాప్ లాగిన్ చేయడానికి ఎస్ఎంఎస్ కోడ్‌ను పొందడం సాధ్యం కానప్పుడు ఒకదాన్ని యాడ్ చేయడం చాలా ప్రయోజకరంగా ఉంటుంది. వాట్సాప్ అప్‌డేట్‌లో భాగంగా మెసేజింగ్ సర్వీస్ ఐఓఎస్ 2.23.24.70 (WABetaInfo) వెర్షన్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త వెర్షన్ వాట్సాప్ అకౌంట్లకు వారి ఈ-మెయిల్ అడ్రస్ లింక్ చేయమని యూజర్లకు ప్రాంప్ట్ కనిపిస్తుంది. యాప్‌లోని మెసేజ్ మీ అకౌంట్ యాక్సెస్ చేయడంలో ఇమెయిల్ సాయపడుతుంది. అయితే, ఇది ఇతరులకు కనిపించదని గమనించాలి. మీ ఇమెయిల్ అడ్రస్ రిజిస్టర్ చేసిన తర్వాత నిర్ధారణ కోసం పంపిన వెరిఫికేషన్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ అకౌంట్లలో మీ ఈ-మెయిల్ అడ్రస్ లింక్ చేయడానికి మీ ఐఫోన్‌లో యాప్ స్టోర్ నుంచి వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను కలిగి ఉండాలి. వాట్సాప్ iOS 2.23.24.70కు అప్‌డేట్ చేసిన తర్వాత యాప్ ఇన్‌స్టాల్ చేయాలి. సెట్టింగ్స్ మెనుకి వెళ్లి, మీ ఇమెయిల్ అడ్రస్ లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ-మెయిల్ అడ్రస్ నొక్కండి. ఈ నెల ప్రారంభంలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం యాప్ బీటా వెర్షన్‌లలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మీ అకౌంట్ ఈ-మెయిల్ అడ్రస్‌కు లింక్ చేసిన తర్వాత మీ ఇమెయిల్ అడ్రస్ ద్వారా వెరిఫికేషన్ కోడ్‌లను పొందవచ్చు.అంతేకాదు.. నెట్‌వర్క్ సమస్యలు లేదా ఇతర సాంకేతిక సమస్యల కారణంగా ఎస్ఎంఎస్ కోడ్‌లను స్వీకరించలేకపోతే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే, వాట్సాప్ మీ ఫోన్ నంబర్‌ను యాప్‌లో మీ ప్రాథమిక ఐడెంటిఫైయర్‌గా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ సర్వీసుకు అథెంటికేషన్ కోడ్‌లను పంపడానికి ఈ-మెయిల్ అడ్రస్ ప్రైవేట్ మార్గంగా పనిచేస్తుంది. వాట్సాప్ స్టేబుల్ ఛానెల్‌లోని ఆండ్రాయిడ్ యూజర్లందరికి అదే ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ సర్వీస్ రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్‌లోని యూజర్లకు సైతం ఈ-మెయిల్ అడ్రస్ లింక్ చేసే ఫీచర్‌ను లాంచ్ చేయనుంది.

Post a Comment

0 Comments

Close Menu