Ad Code

పోకో సీ65 స్మార్ట్ ఫోన్ విడుదల !

పోకో సీ65 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా లాంచ్ అయింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ అయిన పోకో సీ55 తర్వాతి వెర్షన్ గా పోకో సీ65 వచ్చింది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది. పోకో సీ65లో మెరుగైన కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 129 డాలర్లుగా (సుమారు రూ.10,700) నిర్ణయించారు. కానీ ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 109 డాలర్లకే (సుమారు రూ.9,100) కొనుగోలు చేయవచ్చు. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 149 డాలర్లుగా (సుమారు రూ.12,400) ఉంది. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఈ ఫోన్ను 129 డాలర్లకే (సుమారు రూ.10,700) దక్కించుకోవచ్చు. బ్లాక్, బ్లూ, పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మన దేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో పోకో అధికారికంగా వెల్లడించలేదు. 6.74 అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్ జ్ కాగా, యాస్పెక్ట్ రేషియో 20.6:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో దీన్ని ప్రొటెక్ట్ చేయనున్నారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ పై పోకో సీ65 రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 ఇన్బిల్ట్ స్టోరేజ్ అందించారు. స్టోరేజ్ ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో సపోర్ట్ కూడా అందించారు. సెక్యూరిటీ కోసం ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందుబాటులో ఉంది. దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.


Post a Comment

0 Comments

Close Menu