Ad Code

వాట్సాప్​ లో 'వ్యూ వన్స్‌ ఫర్‌ వాయిస్‌ నోట్స్‌' ఫీచర్‌ ?

ప్పటివరకు వ్యక్తిగత చాట్‌ల భద్రతలో భాగంగా ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్‌ 'వ్యూ వన్స్‌ ఫర్‌ వాయిస్‌ నోట్స్‌' పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. వాట్సాప్​లో ఇప్పటికే ఫొటోలు, వీడియోలకు సంబంధించి 'వ్యూ వన్స్‌' ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఏదైనా ఫొటో లేదా వీడియోను ఒకసారి మాత్రమే చూడొచ్చు. దాన్ని స్క్రీన్‌షాట్‌ తీసుకోవడం కూడా కుదరదు. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను వాయిస్‌ నోట్‌ ఫార్మాట్‌కు సైతం యాడ్​ చేయనుంది. వాయిస్‌ రికార్డ్‌ను సెండ్‌ చేసే సమయంలోనే 'వ్యూ వన్స్‌' ఆప్షన్‌ ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను వెబ్‌ఇన్ఫో తన బ్లాగ్‌లో షేర్​ చేసింది. వ్యూవన్స్‌లో పంపే వాయిస్‌ మెసేజ్‌లను మరోసారి వినటానికి వీలుండదని తెలిపింది. ప్రస్తుతం కొంతమంది ఆండ్రాయిడ్‌ బీటా వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పూర్తిస్థాయిలో ఎప్పుడు తీసుకొస్తారనే విషయమై స్పష్టత ఇవ్వలేదు. పర్సనల్​ చాట్​ను ఇతరులు చూడకుండా చాట్​ లాక్​ ఫీచర్​ను తీసుకొచ్చిన వాట్సాప్.. ఇప్పుడు మరో కొత్త ప్రైవసీ ఫీచర్​ను తీసుకురానుంది. లాక్​ చేసిన చాట్​ను హైడ్​ చేసేందుకు ఆప్షన్​ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం లాక్​ చేసిన చాట్​లు ఉన్నట్లు వాట్సాప్​లో కనిపిస్తోంది. ఈ కొత్త ఫీచర్​ ద్వారా సీక్రెట్​ కోడ్​ను సెర్చ్​ బార్​లో ఎంటర్​ చేస్తేనే లాక్​ చేసిన చాట్​లు కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే అందరికీ విస్తరించనుంది.పై రెండింటితోపాటు యూజర్ల భద్రత కోసం వాట్సాప్‌ ఇంకో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. వాట్సాప్‌ కాల్‌ చేస్తున్నప్పుడు ఐపీ అడ్రస్‌ను కాపాడటం దీని ఉద్దేశం. సైబర్​ మోసగాళ్లు లొకేషన్‌ను గుర్తించకుండా అడ్డుకుంటుంది. కాకపోతే ఈ ప్రైవసీ ఫీచర్​ వల్ల వాట్సాప్ కాల్‌ నాణ్యత కాస్త తక్కువగా ఉండొచ్చు. యూజర్ల లొకేషన్‌, ఐపీ అడ్రస్‌ను కనుక్కోవడానికి చేసే ప్రయత్నాలను ఇది తిప్పికొడుతోంది. అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ విషయంలో ఇదెంతగానో భద్రత కల్పిస్తుంది. ప్రైవసీ సెటింగ్స్‌లో అడ్వాన్స్‌డ్‌ సెగ్మెంట్​లో ఈ ఫీచర్‌ ఉంటుంది. దీన్ని ప్రస్తుతం వాట్సాప్‌ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. 

Post a Comment

0 Comments

Close Menu