Ad Code

ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌తో ఆండ్రాయిడ్‌ టీవీగా మార్చవచ్చు !


నెట్‌ సదుపాయం పెరిగడం వల్ల ఫోన్‌ను టీవీకు కనెక్ట్‌ చేయాలంటే మాత్రం కచ్చితంగా ఆ టీవీ ఆండ్రాయిడ్‌కు సపోర్ట్‌ చేయాలి. అయితే ప్రస్తుతం చాలా మంది ఇళ్లల్లో పాత టీవీలే ఉన్నాయి. అందువల్ల కేబుల్‌ ప్రసారాలను మాత్రమే వీక్షిస్తున్నారు. అయితే ఎయిర్‌టెల్‌ అందించే డీటీహెచ్‌ సర్వీసులతో పాత డబ్బా టీవీను కూడా ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకుని మనకు నచ్చిన చానెల్‌ను ఆశ్వాదించవచ్చు. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ డీటీహెచ్‌ (డైరెక్ట్-టు-హోమ్) విభాగం వినియోగదారులకు ఆండ్రాయిడ్‌ టీవీ బాక్స్‌ను అందిస్తుంది. దీన్ని ఎయిర్‌టెల్‌ ఎక్స్‌స్ట్రీమ్‌గా పేర్కొంటున్నారు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ సేవలు చాలా కాలంగా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మీకు పాత టీవీ ఉంటే ఎయిర్‌టెల్ ఆండ్రాయిడ్ బాక్స్ సహాయంతో మీరు దానిని స్మార్ట్ టీవీగా మార్చవచ్చు. అంతేకాకుండా మీకు ఇష్టమైన ఓటీటీ షోలను చూడటానికి అలాగే యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో నేరుగా మీ టీవీలో యాప్‌లకు యాక్సెస్‌ను పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ధర రూ.1500 మాత్రమే. చూడడానికి ప్రీమియం బాక్స్‌లా కనిపించే ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్‌ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్ నుంచి నేరుగా ఆర్డర్ చేయవచ్చు లేదా సమీపంలోని స్టోర్‌ ద్వారా ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ సేవలను పొందవచ్చు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ సేవలు దాదాపు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్‌ బ్లాక్‌తో ఒక బండిల్ సర్వీస్‌గా కూడా కొనుగోలు చేయవచ్చు. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ లాంటిది. ఈ బాక్స్‌ ద్వారా మీరు ఆండ్రాయిడ్‌ టీవీ ప్లాట్‌ఫారమ్ కోసం అందుబాటులో ఉన్న 5,000 కంటే ఎక్కువ యాప్‌లకు యాక్సెస్ పొందుతారు. అలాగే మీకు కావాల్సినప్పుడు లీనియర్ టీవీ కంటెంట్‌కి మారవచ్చు.  స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌కాస్ట్ ఫీచర్‌ను ఉపయోగించాలనుకుంటే ఎయిర్‌టెల్ నుంచి ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్ అంతర్ నిర్మిత క్రోమ్‌కాస్ట్‌తో వస్తుంది. అలాగే గూగుల్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌ కూడా ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్‌ ప్రత్యేకతలు. ఈ ఎయిర్‌టెల్‌బాక్స్ ప్యాకేజింగ్‌లో ఆండ్రాయిడ్‌ టీవీ 9.0 ప్లాట్‌ఫారమ్‌లో రన్ అవుతుంది . అలాగే ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ బాక్స్‌తో మీరు కంటెంట్‌ను 4కే నాణ్యతలో వీక్షించవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu