యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్న ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్‌లో పోల్స్ ఫీచర్‌ను తీసుకు రానున్నది. ఏదైనా ఒక అంశంపై పోల్స్ నిర్వహించే అవకాశాన్ని కల్పించేలా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని హెడ్ ఆడమ్ మోస్సేరి అధికారికంగా తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు చేసే కామెంట్స్‌కు అనుగుణంగా ఈ పోల్స్‌ను నిర్వహించుకునే వెసులుబాటును కల్పించనున్నారు. దీంతో ఒక అంశంపై యూజర్ల అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశాన్ని కల్పించనున్నారు. కామెంట్ సెక్షన్‌ను మరింత ఆసక్తిగా మార్చడంపై దృష్టిసారించిన మెటా అందులో భాగంగానే కామెంట్ సెక్షన్‌లో పోల్ నిర్వహించుకునే ఫీచర్‌ను తీసుకొస్తోంది. అయితే ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉన్నా,కేవలం ఇన్‌స్టా స్టోరీలో మాత్రమే అవకాశం ఉండేది. త్వరలోనే సాధారణ పోస్టులు, రీల్స్ రెండింటిలో కూడా కామెంట్ సెక్షన్స్‌లో పోల్స్ నిర్వహించుకోవచ్చు. పోల్‌లో ఎంత మంది పాల్గొన్నారు.? పేర్కొన్న అంశంపై ఎవరి దేనికి ఓటు వేశారు అన్న దానిని చూసుకోవచ్చు. అయితే పోల్‌లు చేసిన తర్వాత ఎంతకాలం ఉంటాయనే విషయంపై ఇన్‌స్టా ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.
0 Comments