చైనాకు చెందిన ఐకూ 12 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. నవంబర్ నెలలో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతోన్న సమాచారం మేరకు ఈ స్మార్ట్ ఫోన్ వైట్ అండ్ గ్లాస్ ఎడిషన్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్లో 2కే రిసొల్యూషన్, 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింటర్ ఇవ్వనున్నారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఎయిన్ కెమెరాతో పాటు రెండు 50 ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఫ్రంట్ కెమెరాకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీ చిప్సెట్ ప్రాసెసర్‌తో పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదేనని సమాచారం. 4800 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 120 వాట్స్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు ఈ బ్యాటరీ సపోర్ట్ చేయనుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలోనే ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
0 Comments