దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన ఆరు నెలల లోనే నోకియా ఎక్స్ 30 5జీ ధరను కంపెనీ రూ.12,000లు తగ్గించింది. ఈ నోకియా X30 5G స్మార్ట్ ఫోన్ 6.43 అంగుళాల పూర్తి-HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది క్లౌడీ బ్లూ మరియు ఐస్ వైట్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.నోకియా X30 5G స్మార్ట్ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,200mAh బ్యాటరీని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ. 48,999 నుండి రూ. 36,999 కి తగ్గింది. ఇది ఒకేఒక 8GB + 256GB RAM మరియు స్టోరేజ్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ పై నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా ఉంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ చేయబడిన, నోకియా X30 5G స్మార్ట్ ఫోన్ 6.43 అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్ మరియు గరిష్టంగా 700 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. 8GB RAM మరియు 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజీ తో అందుబాటులో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 12 OS తో పనిచేస్తుంది. అలాగే, మూడు సంవత్సరాల వరకు నెలవారీ భద్రతా అప్డేట్ లతో పాటు మూడు ప్రధాన OS అప్‌గ్రేడ్‌లను కంపెనీ వాగ్దానం చేసింది. కెమెరా OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ ప్యూర్‌వ్యూ ప్రైమరీ సెన్సార్ మరియు 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెకండరీ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం, ఫోన్ ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా షూటర్‌ను కలిగి ఉంది. 5G, Wi-Fi 802.11 a/b/g/n/ac/ax-ready, బ్లూటూత్ 5.1, NFC, GPS/AGPS, GLONASS, Beidou మరియు USB టైప్-C పోర్ట్ లు ఉన్నాయి.
0 Comments