Ad Code

బెర్లిన్‌లో షియోమి 13T సిరీస్ ఫోన్లు విడుదల


ర్మనీలోని బెర్లిన్‌లో షియోమి 13T సిరీస్‌ను ఆవిష్కరించింది. ఈ సిరీస్‌లో రెండు మోడల్స్ ఉన్నాయి. ఒకటి షియోమి 13T కాగా, మరోటి షియోమి 13T ప్రో. ఈ రెండు మోడల్స్‌లోని లైకా  కెమెరా సెటప్‌ వీటి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. షియోమి 13T స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది గరిష్టంగా 2,600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. షియోమి 13T మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్ట్రా చిప్‌సెట్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ MIUI 14 ఓఎస్ పై ఈ ఫోన్ రన్ అవుతుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో OISతో కూడిన 50MP సెన్సార్, 50MP పోర్ట్రెయిట్ టెలిఫోటో సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటాయి. ఫోన్ ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఫోటోస్ రిచ్‌ లుక్‌లో కనిపించేలా కెమెరాల్లో లైకా ఫిల్టర్స్ ఉపయోగించారు. షియోమి 13Tలో 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆల్‌ఫైన్ బ్లూ, మియాడొ గ్రీన్, బ్లాక్ వంటి మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. షియోమి 13T ప్రోస్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌తో బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది గరిష్టంగా 2,600 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. షియోమి 13Tలోని కెమెరా సెటప్ ఇందులోనూ ఉంటుంది. షియోమీ 13T ప్రోలో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది సెరామిక్ వైట్, సెరామిక్ బ్లాక్, సెరామిక్ ఫ్లోరా గ్రీన్, మౌంటెన్ బ్లూ వంటి నాలుగు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. షియోమి 13T సిరీస్‌ మోడల్స్‌కు కొత్త వేగన్ లెదర్ ఫినిషింగ్‌తో పాటు వెనుకవైపు గ్లాస్ ప్యానెల్‌ ఉంటుంది. మల్టిపుల్ ఓఎస్ అప్‌డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లకు ఈ సిరీస్ సపోర్ట్ చేస్తుంది. డోల్బీ అట్మోస్ ఆడియోకు సపోర్ట్ చేసే డ్యుయల్ స్పీకర్స్ ఉంటాయి. అయితే భారత్‌లో దీని లాంచింగ్, లభ్యతపై స్పష్టమైన సమాచారం లేదు. కంపెనీ ఈ వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Post a Comment

0 Comments

Close Menu