చైనా మార్కెట్లో మోటోరోలా రేజర్ 40 మరియు మోటోరోలా రేజర్ 40 ఆల్ట్రా విడుదల అయ్యాయి. త్వరలోనే భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఊహించినట్లుగానే అద్భుతమైన డిజైన్, మెరుగైన ఫీచర్లతో లాంచ్ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు కూడా 144Hz రీఫ్రెష్ రేట్ 6.9 అంగుళాల OLED LTPO ఫోల్డింగ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. మోటోరోలా Razr 40 ఆల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13పై పనిచేస్తుంది. 6.9 అంగుళాల (1080*2640) pOLED ఫోర్టబుల్ డిస్‌ప్లే, 165Hz రీఫ్రెష్ రేట్ మరియు 1200 nits బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. మరియు 3.6 అంగుళాల ఔటర్ కవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఔటర్ డిస్‌ప్లేలో వాతావరణ సహా ఇతర నోటిఫికేషన్లు కనిపిస్తాయి. మరియు ఈ ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 SoC ఆధారంగా పనిచేస్తుంది. డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 12MP మెయిన్ సెన్సార్ కెమెరా మరియు 13MP సెకండరీ ఆల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్ కెమెరాలు కలిగి ఉంటుంది. మరియు ఫోన్ ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ ఫోన్ 3800mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కూడా ఆల్ట్రా మాదిరిగానే సాఫ్ట్‌వేర్, డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది. కానీ ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 SoC ఆధారంగా పనిచేస్తుంది. Razr 40 డ్యూయర్ కెమెరాలను కలిగి ఉంది. 64MP ప్రైమరీ సెన్సార్ మరియు 12MP ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఫోన్ ముందువైపు 32MP కెమెరాను ఏర్పాటుచేశారు. మరియు ఈ ఫోన్ 4200mAh బ్యాటరీ సామర్థ్యం మరియు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. మోటోరోలా Razr 40 ఆల్ట్రా ఫోన్ 8GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ ధర CNY 5,699 (భారత కరెన్సీలో రూ.66,000), 12GB ర్యామ్, 512GB అంతర్గత స్టోరేజీ ధర CNY 6,399 (భారత కరెన్సీలో 74,200) కలిగి ఉంది. ఈ ఫోన్ ఫెంగ్యా బ్లాక్, ఐస్ క్రిస్టల్ బ్లూ, మెజెంటా షేడ్ రంగుల్లో అందుబాటులో ఉంది.
0 Comments