కాగ్నిజెంట్ దాదాపు 3,500 మంది ఉద్యోగులను ఇంటికి పంపే ప్రయత్నాల్లో ఉంది. అలాగే వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా కొన్ని కార్యాలయాలను మూసివేయనుందని కంపెనీ సీఈఓ ఎస్ రవి కుమార్ వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి ఆదాయం తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మొత్తం 3,500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఇందులో భారత్‌కు చెందిన వారు ఎంతమంది ఉంటారనేది తెలియరాలేదు. కాగ్నిజెంట్ పేరుకే అమెరికా కంపెనీ కార్యకలాపాలన్నీ భారత్‌లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ప్రస్తుతం కాగ్నిజెంట్‌లో 3,51,500 మంది ఉద్యోగులు పని చేస్తుండగా, అందులో 2 లక్షల వరకు భారత్‌లోనే విధులు నిర్వర్తిస్తున్నారు.
0 Comments