దేశీయ మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 7ఏ మే 11న లాంఛ్ కానుంది. పిక్సెల్ 6ఏకు కొనసాగింపుగా రానుంది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ భారత్‌లో రూ. 50,000లోపు అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పిక్సెల్ 6ఏ భారత్‌లో ప్రారంభ ధర రూ. 43,999గా గూగుల్ అప్పట్లో నిర్ధారించింది. భారత్‌లో ఆపై దీని ధరను భారీగా తగ్గించడంతో ఈ డివైజ్‌లు హాట్ కేక్స్‌గా అమ్ముడుపోయాయి. ఈ 5జీ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ. 40,000 కంటే తక్కువ ధరకు విక్రయించింది. ఆపై పిక్సెల్ 6ఏ ధర లాంఛ్ అయిన కొద్ది నెలలకు ఏకంగా రూ. 35,000 కంటే తక్కువకు పడిపోయింది. పిక్సెల్ 7ఏ రూ. 40,000 అంతకంటే తక్కువకు అందుబాటులోకి తీసుకువస్తే కస్టమర్ల నుంచి మెరుగైన స్పందన ఉంటుందని భావిస్తున్న గూగుల్ గత లాంఛ్‌లను పరిశీలిస్తే ఇంత తక్కువ ధర నిర్ధారించకపోవచ్చని భావిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో పిక్సెల్ 7ఏ రూ. 37,100 నుంచి రూ 41,200 ఉండగా కస్టమ్స్, ఇతర చార్జీల కారణంగా గ్లోబల్ మార్కెట్‌కు, భారత్‌లో ధరకూ వ్యత్యాసం రూ. 7000 వరకూ ఉంటుందని టెక్ నిపుణుల అంచనా.
0 Comments