Ad Code

సెల్ ఫోన్‌కు 50 వసంతాలు !


ఈ రోజు సెల్ ఫోన్ మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. ఎక్కడికెళ్లినా, ఏం చేసినా, ఎలా ఉన్నా.. ఫోన్ ఉండాల్సిందే. తిన్నా, ఎక్కడికైనా వెళ్తున్నా... చివరికి బాత్ రూంలో కూడా మొబైల్ ఫోన్ ను వాడుతున్నారంటే దీన్ని ఎంతగా ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దీన్ని కరెక్టుగా యూజ్ చేసుకుని ప్రయోజకులైన వాళ్లున్నారు.. మితిమీరి, అనవరసరైన వాటికి ఉపయోగించి జీవితాన్ని నరకప్రాయం చేసుకున్న వాళ్లూ ఉన్నారు. అలాంటి సెల్ ఫోన్ ఎప్పుడు పుట్టింది. ఎలా పుట్టింది. అసలు ఎవరు దీన్ని కనిపెట్టారు.. ఇలాంటి విషయాలు తెలియకుండానే మొబైల్ లో నేడు అనేక సాఫ్ట్ వేర్స్ ను వాడుతున్నాం... అనేక లాభాలను పొందుతున్నాం. మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చే బర్త్ డే లాగా  సెల్ ఫోన్ కు కూడా ఓ రోజుంది. అదే ఈ రోజు. మరో ముఖ్య విషయమేమిటంటే ఈ రోజుతో మొదటి సెల్‌ఫోన్ కాల్‌ 50సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మోటరోలా ఇంజనీర్ మార్టిన్ కూపర్ మిడ్‌టౌన్ మాన్‌హాటన్‌లో నిలబడి, హ్యాండ్‌హెల్డ్ పోర్టబుల్ సెల్‌ఫోన్ నుండి న్యూజెర్సీలోని బెల్ ల్యాబ్స్ ప్రధాన కార్యాలయానికి మొదటి పబ్లిక్ కాల్ చేశారు. ఏప్రిల్ 3, 1973న ఉనికిలోకి వచ్చిన ఈ ఫోన్ చాలా బరువుగా ఉండేది. దీని బరువు దాదాపు కిలో కంటే ఎక్కువే. దీని బ్యాటరీ 25నిమిషాలు. మొదట్లో ఫోన్లు చాలా ఖరీదైనవిగా ఉండేవి. అప్పట్లో ఒక్కో హ్యాండ్‌సెట్ ధర 5వేల డాలర్లుగా ఉండేది.

1984 : మోటరోలా కంపెనీకి చెందిన DynaTAC పోర్టబుల్ సెల్‌ఫోన్ .. దాదాపు 2 పౌండ్ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉండేది. ఇది వినియోగదారులకు 35 నిమిషాల టాక్ టైమ్‌ను అందించేది.

1989 : Motorola MicroTAC కు చెందిన మొట్టమొదటి ఫ్లిప్ ఫోన్ ప్రవేశపెట్టారు.- ఇది మొదటి పాకెట్-సైజ్ ఫోన్. దీంట్లో బ్యాటరీ జీవిత కాలాన్ని రెండింతలు పెంచుతూ డిజైన్ చేశారు. ఇది ఒక గంట కంటే ఎక్కువ టాక్ టైమ్‌ను అందించేది.

1992 : మొదటి టెక్ట్స్ మెసేజ్ 'మెర్రీ క్రిస్మస్' పంపబడింది. దాంతో పాటు QWERTY కీబోర్డులతో ఫోన్‌లు ప్రవేశపెట్టబడ్డాయి. నోకియా కమ్యూనికేటర్ 9000 1990ల మధ్యలో ప్రారంభమైంది.

1993 : మొదటి "స్మార్ట్‌ఫోన్" ను ఐబీఎం ప్రవేశపెట్టబడింది. సైమన్ పర్సనల్ కమ్యూనికేటర్ కాల్‌లు, ఫ్యాక్స్‌లు, టెక్స్ట్ మెసేజ్ ల కోసం దీన్ని ఉపయోగించవచ్చు. ఇందులో క్యాలెండర్, నోట్స్ ఫోల్డర్‌లు, అపాయింట్‌మెంట్ షెడ్యూలర్‌లు కూడా ఉండేవి.

2000 : షార్ప్ కెమెరాతో మొదటి సెల్‌ఫోన్‌ను విడుదల చేశారు.

2002 : మొదటి బ్లాక్‌బెర్రీ ఫోన్‌లు 2002లో విడుదలయ్యాయి. సెల్యులార్ ఫోన్ సర్వీసెస్, వైర్‌లెస్ ఇ-మెయిల్ కెపాసిటీ, ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందిస్తూ కొత్త 'స్మార్ట్‌ఫోన్‌లు' అందుబాటులోకి వచ్చాయి.

2006 : LG ప్రాడా టచ్‌స్క్రీన్‌తో కూడిన మొదటి మొబైల్ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది.

2007 : Apple మొట్టమొదటి iPhone పరిచయమైంది. ఆల్ ఇన్ వన్ డిజిటల్ మ్యూజిక్ ప్లేయర్, కెమెరా, QWERTY కీబోర్డ్ స్థానంలో టచ్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన ఐఫోన్ అందుబాటులోకి వచ్చింది.

2008 : HTC డ్రీమ్ స్లైడర్ - మొదటి ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

2010 : యూఎస్ లో మొట్టమొదటి 4G మొబైల్ ఫోన్ ను ప్రవేశపెట్టారు. HTC Evo6 పేరుతో పెద్ద టచ్‌స్క్రీన్, రెండు కెమెరాలు, GPS నావిగేషన్, HDMI అవుట్‌పుట్, మొబైల్ హాట్‌స్పాట్ కెపాసిటీ ఇందులో కొత్తగా చేర్చారు.

2017 : iPhone X స్మార్ట్‌ఫోన్‌లలో మొదటి ఫేస్ రికగ్నైజేషన్ సెక్యూరిటీ ఫీచర్‌ను అందించింది.

నేడు 5G సాంకేతికత అమల్లోకి వచ్చింది. ఈ 5జీ టెక్నాలజీతో నివాసాలను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో పలు డిజైన్‌లలో పెద్దవిగా, సరళంగా ఉండడంతో పాటు.. బడ్జెట్ ఫ్రెండ్లీలోనూ మంచి మొబైల్స్ లభిస్తున్నారు. పెద్ద స్క్రీన్, తక్కువ బటన్‌లతో స్మార్ట్‌ఫోన్‌ అట్రాక్ట్ చేస్తుండగా.. అందులో స్క్రీన్‌లు వంగినట్టుగా, హై కెపాసిటీ కెమెరాలు, హై స్టోరేజ్, బ్యాటరీ స్టోరేజ్ లతో మార్కెట్ లో వివిధ ధరలలో లభిస్తున్నాయి.

గత 50ఏళ్లలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ విషయంలో విపరీతమైన కొత్త పోకడలు అందుబాటులోకి వచ్చాయి. ఆ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే

    1G వైర్‌లెస్ ఫోన్ కాల్‌లను తీసుకువచ్చింది.

    2G టెక్స్ట్ మెసేజ్ లను అందించింది.

    3G మొబైల్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను అందించింది.

    4G స్ట్రీమింగ్, మెరుగైన సేవలను సృష్టించింది.

    5G ఈ టెక్నాలజీలన్నింటినీ విస్తరించింది.IOT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) లాంటి ఇతర కొత్త సాంకేతికతలను యాక్సెస్‌ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu