Ad Code

అకౌంటును తాత్కాలికంగా డియాక్టివేట్ చేయడం ఎలా?


ఎలోన్ మస్క్ ట్విట్టర్ సంస్థను టేకోవర్ చేసుకున్నాడు. ట్విట్టర్ లో మాట్లాడే స్వేచ్ఛను తీసుకొనిరావాలని ప్రయత్నిస్తున్న ఎలోన్ మస్క్ రాబోయే నెలల్లో ట్విట్టర్ ని ఎలా మారుస్తాడనే విషయం మీద కొంత మంది ఉత్సహంగా ఉంటే మరికొంత మంది ఆందోళనలో ఉన్నారు. ఎవరైనా కొంత సమయం పాటు ట్విట్టర్ నుండి విరామం తీసుకోవాలనుకుంటే కనుక మీరు మీ అకౌంటును తాత్కాలికంగా డియాక్టివేట్ చేయవచ్చు.  ముందుగా ట్విట్టర్ ప్రొఫైల్‌కి వెళ్లి మెను చిహ్నంపై నొక్కండి. సెట్టింగ్‌స్ > ప్రైవసీ విభాగంకి వెళ్లండి. తరువాత "అకౌంట్" ఎంపికకి వెళ్లి, ఆపై "మీ అకౌంటును డియాక్టివేట్ చేయి" ఎంపికను ఎంచుకోండి. "డియాక్టివేట్ చేయి" ఎంచుకోవడం ద్వారా మీరు మీ అకౌంటును డియాక్టివేట్ చేయాలనుకుంటున్నారని నిర్ధారించి, ఆపై మళ్లీ నిర్ధారించండి. అకౌంటును డియాక్టివేట్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలలో మొదటిది మీ డియాక్టివేషన్ విండో 30 రోజులు దాటితే కనుక మీ అకౌంట్ శాశ్వతంగా తొలగించబడుతుంది. కావున 30 రోజులలోపే అకౌంటును తిరిగి యాక్టివేట్ చేయాలి. అకౌంట్ ఒకసారి తొలగించిన తర్వాత మీరు దాన్ని మళ్లీ యాక్టివేట్ చేయలేరు. కావున మీ పాత ట్వీట్‌లకు యాక్సిస్ ను కోల్పోతారు. అకౌంటును డీయాక్టివేట్ చేసినట్లయితే కనుక ఇతరుల ట్వీట్లలో అకౌంట్ యూసర్ నేమ్ ప్రస్తావనలు ఉంటాయి. అయితే మీ ప్రొఫైల్ అందుబాటులో లేనందున హ్యాండిల్ మీ ప్రొఫైల్‌కి లింక్ చేయబడదు.

Post a Comment

0 Comments

Close Menu