Ad Code

కూరగాయలు అమ్మిన సోనూసూద్‌

 

చిరు వ్యాపారుల, తోపుడు బండ్ల వ్యాపారుల నుంచి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసి వారిని ఆర్థికంగా నిలబెట్టెలా కృషి చేయాలని ప్రజలను  సోనూసూద్‌ అభ్యర్థించాడు. తోపుడు బండిలో కూరగాయలు అమ్ముతున్న ఇద్దరు యువకులతో సోనూసూద్‌ ముచ్చటించాడు. కాసేపు కూరగాయలను అమ్మాడు. వారితో మాట్లాడిన సోనూసూద్‌ వారి నుంచి కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వారి మాట్లాడుతున్న వీడియోను సోన్‌సూద్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్డర్ మి ఫర్ ఎ ఫ్రీ హోమ్ డెలివరీ ఆఫ్ ఫ్రెష్ వెజిటెబుల్స్, ఈట్‌ హెల్తీ లైవ్‌ క్యాప్షన్‌తో సపోర్ట్‌ స్మాల్‌ బిజినెస్‌ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ను వీడియోకు జత చేశాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఆపదలో ఉన్న వారికి సోనూసూద్‌ ఆపన్న హస్తంలా నిలిచాడు. హాస్పిటల్‌లో ఆక్సిజన్ ప్లాంట్ల దగ్గర నుండి వలస దారులను స్వంత స్థలాలకు చేర్చేందుకు బస్సుల్లో తరలించం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. లాక్‌డౌన్‌లో సోనూసూద్‌ చేసిన సేవలతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు. అవసరమైన వాళ్లకు తాను కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నానంటూ చాలా సందర్భాల్లో సోనూ నిజం చేశాడు.

Post a Comment

0 Comments

Close Menu