దేశంలో తయారవుతున్న ప్రధాన వ్యాక్సిన్లలో కోవాగ్జిన్ ఒకటి. ప్రస్తుతం కోవాగ్జిన్ ను గుర్తిస్తూ గయానా దేశం నిర్ణయం తీసుకుంది. సోమవారం ఆస్ట్రేలియా దేశం కోవాగ్జిన్ గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే మరో దేశం గయానా కోవాగ్జిన్ టీకాను గుర్తించింది. ప్రస్తుతం కోవాగ్జిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అత్యవసర అనుమతులను మరికొన్ని రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 26న సమావేశం అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక సలహా గ్రూప్ భారత్ బయోటెక్ నుంచి మరింత సమాచారం కావాలని కోరింది. ఇప్పటికే పలుమార్లు క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన సమాచారాన్ని సాంకేతికి సలహా గ్రూపు కోరింది. ఇటీవల జీ20 సమావేశం వేదికగా కూడా ప్రధాని మోదీ కోవాగ్జిన్ గుర్తింపు గురించి మాట్లాడారు. WHO నుంచి అత్యవసర అనుమతులు వస్తే ప్రపంచంలోని అన్ని దేశాలకు కోవాగ్జిన్ ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు కోవాగ్జిన్ వేసుకున్న ప్రయాణికులకు విదేశాలలోకి సులభంగా అనుమతి లభిస్తుంది. ముఖ్యంగా కోవాగ్జిన్ వేసుకుని విదేశాలకు వెళ్లాలనుకుంటున్న విద్యార్ధులకు ఇబ్బందులు తప్పుతాయి.
0 Comments