నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ వివాహ బంధంలో అడుగుపెట్టారు. బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్‌లో గల తన నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. ఈ మేరకు 24 ఏళ్ల మలాలా తన భాగస్వామి అస్సర్‌తో కలిసి సామాజిక మాధ్యమాల వేదికగా ఈవిషయాన్ని పంచుకున్నారు. ''ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అస్సర్, నేను జీవిత భాగస్వాములు అయ్యాం. బర్మింగ్‌హమ్‌లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం. మీ ఆశీస్సులు మాకు అందించండి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నాం'' అని మలాలా ట్వీట్ చేశారు. తన భర్త అస్సర్‌తో దిగిన ఫొటోలను పంచుకున్నారు. పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో జన్మించిన మలాలా బాలికల విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు. దీంతో 2012లో తాలిబన్లు పాఠశాల బస్సులోకి చొరబడి ఆమెపై కాల్పులకు దిగారు. మలాలా ఎడమ కణతిపై, శరీరంపై తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో ఆమెను వెంటనే పెషావర్‌కు తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. అయితే బుల్లెట్ గాయాలకారణంగా ఉత్తమ చికిత్స కోసం బ్రిటన్‌కు తరలించారు. పలు శస్త్రచికిత్సల తర్వాత మలాలా కోలుకున్నారు. అనంతరం బ్రిటన్‌లోనే తల్లిదండ్రులతో కలిసి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.
0 Comments