థైరాయిడ్ గ్రంథి ఇది శరీరంలోని జీవక్రియ ప్రక్రియలను నియంత్రిస్తుంది. సమతుల్య శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల పనితీరు మరియు బరువు నిర్వహణ ఈ గ్రంథిలో కొన్ని ముఖ్యమైన విధులు. థైరాయిడ్ గ్రంధికి సాధారణంగా రెండు రకాల సమస్యలు ఉంటాయి. హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ గ్రంధితో సమస్యలు ఉంటే, అది శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య మహిళల్లోఎక్కువగా కనిపిస్తుంది. శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూ ఈ వ్యాధిని అంచనా వేయవచ్చు.థైరాయిడ్ గ్రంథి శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన హార్మోన్లనుఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువ, తక్కువ అయిన ఆరోగ్యంపై ప్రభావితం పడుతుంది. థైరాయిడ్ హార్మోన్లు తగ్గితే శరీర బరువుపెరుగుతుంది. దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. థైరాయిడ్ హార్మోన్లు పెరిగితే శరీర బరువు తగ్గుతుంది. దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడ్ శరీరంలోని ప్రతి కణానికి పై ప్రభావితం చూపుతుంది. తీవ్రమైన అలసట , బరువు తగ్గడం, జుట్టు రాలడం, అధిక చెమటలు, బలహీనంగా అనిపించడం, అధిక విరేచనాలు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే అది థైరాయిడ్ గ్రంథి సమస్యల వల్ల కావొచ్చు.మహిళల్లో థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే నెలసరులు సరిగ్గా సమయానికి రాకుండా క్రమం తప్పే అవకాశం ఉంది. తద్వారా గర్భం దాల్చే అవకాశం తగ్గిపోతుంది. కాబట్టి థైరాయిడ్ సమస్యలకు తగిన చికిత్స చేయించుకున్నట్లైతే ఈ సమస్యలనుండి దూరంగా ఉండవచ్చు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పాలకూర, ముల్లంగి, సోయాబీన్స్, స్ట్రాబెర్రీస్‌ను తినడం తగ్గించాలి. పాలు, చీజ్, మాంసం, చేపలు, ఖర్జూరం, గుడ్డు తెల్ల సొన తినాలి. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మందుల ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. రోజూ పరగడుపునే ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల సమస్య నియంత్రణలో ఉంటుంది. కొబ్బరి నూనెలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంధి మెరుగ్గా పనిచేయడంలో సహాయపడతాయి. కొబ్బరి నూనెను వేడి చేయకుండా తీసుకుంటే, అది శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. వ్యాయామం,సరైన సమతుల్య ఆహారంతో, కొబ్బరి నూనె థైరాయిడ్ సమస్య నుండి బయటపడవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ థైరాయిడ్ హార్మోన్ల సమతుల్య ఉత్పత్తి , వ్యక్తీకరణలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు శరీరంలోని అదనపు ఆమ్లాన్ని తగ్గించడానికి మరియు క్షారతను పెంచడానికి సహాయపడుతుంది. థైరాయిడ్ సమస్యకు ఒక సింపుల్ హోం రెమెడీ ఉంటే అది అల్లం. ఇది థైరాయిడ్ సమస్యకు ప్రధాన కారణమైన వాపును సరిచేయడానికి సహాయపడుతుంది. అల్లంతో టీ తయారు చేసి తాగవచ్చు. థైరాయిడ్ సమస్యకు కారణమయ్యే కారకాలతో పోరాడటానికి విటమిన్లు సహాయపడతాయి. ముఖ్యంగా, థైరాయిడ్ గ్రంథి యొక్క సమతుల్య పనితీరుకు B విటమిన్లు అవసరం. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారికి విటమిన్ బి12 అవసరం. విటమిన్ డి లోపం వల్ల కూడా థైరాయిడ్ సమస్య వస్తుంది. ప్రతిరోజూ కనీసం 15 నిమిషాలు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోవటం మంచిది. అవిసె గింజల్లో మంచి కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడతాయి. ఇందులో మెగ్నీషియం మరియు విటమిన్ బి12 పుష్కలంగా ఉన్నాయి, ఇది హైపోథైరాయిడిజంతో పోరాడటానికి సహాయపడుతుంది. బీన్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది హైపోథైరాయిడిజం యొక్క సాధారణ దుష్ప్రభావమైన మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది.
0 Comments