ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని 2021 ఏడాదికి గాను అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ కార్డ్, జాషువా డి యాంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్‌లు దక్కించుకున్నారు. అమెరికా 2021 ఆర్థిక శాస్త్రానికి నోబెల్ బహుమతిని అందుకున్న డేవిడ్ కార్డ్ సగం పురస్కారం దక్కగా, మిగిలిన ఇద్దరూ సగం పురస్కారం అందుకున్నారు. నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్తలలో డేవిడ్ కార్డ్ బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన వ్యక్తి కాగా.., జాషువా డి యాంగ్రిస్ట్ మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందినవారు. గైడో ఇంబెన్స్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యక్తి. లేబర్ మార్కెట్ గురించి ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కొత్త అంశాలను వెలుగులోకి తీసుకుని రాగా, దీని ద్వారా పరిశోధనల్లో విప్లవాత్మక మార్పులు వచ్చినట్లు నోబెల్ కమిటీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే వారికి అరుదైన నోబుల్ బహుమతిని ప్రకటించింది. సహజ పరిశోధనల ద్వారా ఈ ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలు సంచలనాత్మక విషయాలను వెలుగులోకి తీసుకుని వచ్చారు. ఇమ్మిగ్రేషన్ వల్ల జీతంపై ప్రభావం ఉంటుందా? ఉద్యోగంలో మార్పు ఎలా ఉంటుంది? అనే అంశాలపై స్టడీ చేశారు. పెద్ద చదువులు చదవడం వల్ల భవిష్యత్తులో ఆదాయం ఎలా ఉంటుందనే దానిపై సహజంగా వీరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. కార్మిక ఆర్థిక వ్యవస్థ గురించి కార్డ్ చేసిన సూచనలు మేలు చేసేవిగా ఉన్నాయని నోబుల్ కమిటీ అభిప్రాయపడింది.
0 Comments