Ad Code

ఎయిర్ టెల్, ఐడియా, ఓడాఫోన్లకు భారీ జరిమానా



ఎయిర్ టెల్, ఐడియా, ఓడాఫోన్ వంటి టెలికం కంపెనీలు గతంలో దేశంలో అగ్ర స్థానంలో ఉండేవి. వీటిలో ఎయిర్ టెల్ ఎక్కువ వినియోగ దారులు ఉండేవారు. తర్వాత ఐడియా , ఓడాఫోన్ లు వరుస గా ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ లెక్కలు మారి పోయాయి అనుకోండి. మన దేశంలో జియో కంపెనీ వచ్చిన నాటి నుంచి ఈ కంపెనీ ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయాయి. జియో ను తట్టు కోలేక డొకొమో, ఎయిర్ సెల్ వంటి చిన్న చిన్న కంపెనీలు తమ దుకాణాన్ని మూసుకున్నాయి. అలాగే ఐడియా, ఓడాఫోన్ లు కలసి పోయి వీఐ గా మారి పోయాయి. కానీ ఒక ఎయిర్ టెల్ మాత్రం కాస్త కుస్తో తమ వినియోగ దారులను కాపాడు కుంటు వస్తుంది. కానీ తాజా గా ఈ కంపెనీ లకు టెలికం శాఖ భారీ షాక్ ను ఇచ్చింది. మూడు కంపెనీ లకు కలపి దాదాపు కరూ.3050 కోట్ల జరిమానా ను విధించింది. అయితే 2016లో రిలయన్స్ జియో దేశానికి పరిచయం అయింది. అయితే ఈ సమయంలో ఎయిర్ టెల్‌, ఐడియా తోపా టు ఓడాఫోన్ కంపెనీ లు జియో తో ఇంటర్ కనెక్టివిటీని నిలిపివేశాయని అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఈ మూడు నెటవర్క్ లకు జియో నుంచి చేసిన ఫోన్ కాల్స్ లో దాదాపు 75 శాతం తిరస్కరణకు గురి అవుతున్నాయని జియో కూడా ట్రాయ్ కి ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదు విచారించి ఈ మూడు కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. కాగ మొదట ఈ మూడు కంపెనీల లైసెన్సు లు రద్దు చేయాలని భావించినట్టు తెలుస్తోంది. కానీ చాలా మంది వినియోగ దారులు ఇబ్బందులకు గురి అవుతారని భారీ జరిమానాలు విధించిందని సమాచారం. దీనిలో ఎయిర్ టెల్ కంపెనీకి రూ. 1050 కోట్లు, ఐడియా కంపెనీకి రూ. 950 కోట్లు అలాగే వొడాఫోన్ కు రూ. 1050 కోట్ల జరిమానను విధించింది. అయితే ఈ జరిమానా ను 2019 లో డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఆమోదించింది. కానీ ఈ కంపెనీలు ఇంత వరకు ఎలాంటి ఫెనాల్టీ కట్టకపోవడంతో ఈ కమిషన్ ఆగ్రహానికి గురి అయింది. ఈ కంపెనీలు తమ జరిమానాలను మూడు వారల్లోగా చెల్లించాలని ఆదేశించినట్టు సమాచారం. అయితే టెలికం శాఖ తమ పై విధించిన జరిమానా పై ఎయిర్ టెల్ స్పంధించింది. దీనిపై తాము అసంతృప్తి గా ఉన్నామని అన్నారు. అలాగే తమపై వచ్చిన ఆరోపణలు అన్నీ కూడా ఆధారం లేనివి అని కొట్టి పడేశారు. ఈ జరిమానా పై తాము కోర్టు కు వెళ్తామని ఎయిర్ టెల్ కంపెనీ అధికార ప్రతినిధి ఒక్కరు తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu