ఉత్తరప్రదేశ్‌లో నిరసన చేస్తున్న రైతులపైకి మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా 8 మంది గాయపడినట్లు రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో హింస చెలరేగడంతో ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితిని నియంత్రించేందుకు భారీగా పోలీసులను మోహరించారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆదివారం రోడ్డు పక్కన నిరసన తెలిపారు. కాగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌లోని వాహనాలు కొందరు రైతులను ఢీకొన్నాయని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మరణించగా 8 మందికి గాయాలయ్యాయని ట్విట్టర్‌లో పేర్కొంది. అయితే దీని గురించి యూపీ ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ ఘటన నేపథ్యంలో లఖింపూర్ ఖేరిలో హింస చెలరేగింది. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి గాయపడినట్లు తెలుస్తున్నది. కాగా, పరిస్థితిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు.
0 Comments