Ad Code

మార్కెట్​లోకి టీవీఎస్​ జూపిటర్​ 125

 

దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కొత్త స్కూటర్​ను మార్కెట్​లోకి విడుదల చేసింది. కొత్త జూపిటర్​ 125 మోడల్​ను ఆవిష్కరించింది. ఇప్పటివరకు 110 సీసీ వరకే పరిమితమైన ఈ మోడల్​ను 125 సిసి కి అప్‌డేట్ చేసింది. దీని ద్వారా ఈ సెగ్మెంట్​లో ప్రత్యర్థిగా ఉన్న హోండా యాక్టివా 125సీసీ, సుజుకియాక్సెస్​ 125 సీసీ టూవీలర్స్​కు గట్టిపోటీనివ్వనుంది. దీంట్లో అనేక అప్​డేటెడ్​ ఫీచర్లను అందించింది. రెండు హెల్మెట్లు భద్రపర్చుకునేంత సీట్​ స్పేస్​తో ఈ స్కూటర్​ను డిజైన్​ చేయడం ప్రత్యేకత. సరికొత్త టీవీఎస్​ జూపిటర్​ 125 డ్రమ్​, డ్రమ్​ అలాయ్​, డిస్క్​ వేరియంట్లలో లభిస్తుంది. ఇది డాన్​ ఆరెంజ్​, ఇండిబ్లూ, ప్రిస్టిన్​ వైట్​, టైటానియం, గ్రే కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త మోడల్​ లాంచింగ్​పై టీవీఎస్​ మోటార్​ డైరెక్టర్​, సీఈఓ కేఎన్​ రాధాకృష్ణన్​ మాట్లాడుతూ ''కొత్త టీవీఎస్​ జూపిటర్​ 125సీసీ మోడల్​లో న్యూ స్టయిలింగ్​, న్యూ ప్లాట్​ఫామ్​, సెగ్మెంట్​ ఫస్ట్​ ఫీచర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాం. 2013 లో టీవీఎస్​ జూపిటర్​ ప్రారంభమైనప్పటి నుంచి మంచి అమ్మకాలు నమోదు చేసింది. దేశంలోని అత్యంత పాపులర్ స్కూటర్లలో ఇది ఒకటిగా నిలిచింది. అందుకే దీన్ని 125 సీసీకి అప్​గ్రేడ్​ చేస్తూ కొత్త వేరియంట్​ను విడుదల చేస్తున్నాం. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా దీన్ని రూపొందించాం." అని చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu