Ad Code

రైల్ కౌశల్ వికాస్ యోజన



ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన ఆధ్వర్యంలో రైల్‌ కౌశల్‌ వికాస్‌ యోజన కార్యక్రమాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్‌కేవీవై కింద మారుమూల ప్రాంతాల్లోనూ శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, ఫిట్టర్‌ కోర్సులపై భారతీయ రైల్వే శిక్షణ ఇవ్వనున్నది. రాబోయే మూడేండ్లలో 50వేల మందికి శిక్షణ ఇవ్వనుండగా.. ప్రారంభంలో వెయ్యి మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆయా కోర్సుల్లో ప్రాథమికంగా వంద గంటల పాటు శిక్షణ ఉండనుంది. పదో తరగతి మార్కుల ఆధారంగా పూర్తి పారదర్శకంగా, ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై, 18-35 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు కార్యక్రమంలో శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే శిక్షణ ఆధారంగా రైల్వేలో ఉద్యోగం పొందేందుకు ఎలాంటి హక్కు ఉండదని అధికారులు పేర్కొన్నారు. శిక్షణకు సంబంధించిన పాఠ్యాంశాలను బనారస్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ రూపొందించింది. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం అభ్యర్థులకు నేషనల్‌ రైల్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సర్టిఫికెట్‌తో పాటు ట్రేడ్‌ టూల్‌కిట్లు ఇవ్వనున్నారు.

Post a Comment

0 Comments

Close Menu