హాంగ్‌కాంగ్‌కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో వరుసగా స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ భారత్‌లో మార్కెట్ పెంచుకుంటోంది. ఈ సంస్థ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. టెక్నో స్పార్క్ 8 పేరుతో సరికొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన టెక్నో స్పార్క్ 7 సిరీస్‌కు కొనసాగింపుగా ఇది విడుదలైంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే కొత్త స్పార్క్ 8 మునుపటి టెక్నో స్పార్క్ 7 మాదిరిగానే ఉంటుంది. భారత మార్కెట్లో ఇది రూ.7,999 ధర వద్ద లభిస్తుంది. అట్లాంటిక్ బ్లూ, టర్కోయిస్ సయాన్, ఐరిస్ పర్పుల్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకాలు జరగనున్నాయి. టెక్నో స్పార్క్ 8 స్మార్ట్‌ఫోన్ 6.52 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్ A25 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 2 జీబీ ర్యామ్, 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ని అందించారు. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ సహాయంతో స్టోరేజ్‌ను 256 జీబీ వరకు పొడిగించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆధారిత HiOS 7.6 పై నడుస్తుంది. ఈ డివైజ్‌లో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ను టెక్నో అందించింది. కెమెరా మాడ్యూల్‌లో బయోమెట్రిక్ సెక్యూరిటీ, క్వాడ్ ఫ్లాష్ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్లను కూడా చేర్చింది. దీని వెనుకవైపు 16 మెగాపిక్సెల్ ప్రైమరీ, సెకండరీ కెమెరా సెన్సార్ కెమెరాను అందించింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ప్రత్యేకంగా 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను చేర్చింది. టెక్నో స్పార్క్ 8 లోని కెమెరా యాప్‌లో 1080p టైమ్-లాప్స్ ఫోటోగ్రఫీ, స్మైల్ క్యాప్చర్, పనోరమ, పోర్ట్రెయిట్ మోడ్, స్లో మోషన్ మోడ్‌లను అందించింది. టెక్నో స్పార్క్ 8లో డ్యుయల్ 4G వోల్ట్, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5 ఎంఎం జాక్ వంటి కనెక్టింగ్ ఫీచర్లను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ యూనిట్‌ను చేర్చింది. ఈ ఫోన్ సుమారు 29 రోజుల స్టాండ్‌బై టైం, 31 గంటల టాక్ టైమ్, 13.27 గంటల గేమ్ టైమింగ్ అందిస్తుంది.
0 Comments