కొంతమంది పిల్లలు టీవీ స్క్రీన్‌ను చూస్తుండగా వీడియో ప్రారంభమవుతుంది. ఆ టీవీలో కొందరు పిల్లలు క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటారు. అదేలా ఉంటుంది అంటే టీవీలో లైవ్ మ్యాచ్ చూసినట్లే ఉంటుంది. అయితే, కొన్ని సెకన్ల తర్వాత బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి నేరుగా టీవీ వెలుపల చూస్తున్న పిల్లలపై పడుతుంది. దీంతో.. ఫీల్డర్ వచ్చి ఫ్రేమ్‌లో నుంచి తొంగి చూసి బంతి ఇవ్వాలంటూ అక్కడ కూర్చొని టీవీ చూస్తున్న పిల్లలను అడుగుతాడు. దీంతో అప్పుడు తెలుస్తుంది అసలు మేటర్.. అది రీల్ మ్యాచ్ కాదని.. ఫ్రేమ్ నుంచి వెనుక జరుగుతున్న గల్లీ క్రికెట్‌ను పిల్లలు ఆ టీవీని అలా అమర్చి చూస్తున్నారని. ఆ పిల్లల ఐడియా చూసి ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యి ఈ వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దానికి క్యాప్షన్‌గా.. ఇది పాత వీడియోనే అయినా నాకేందుకో మరోసారి పోస్ట్ చేయాలనిపించింది. కరోనా మహమ్మారి మనల్ని స్క్రీన్లకే ఎలా పరిమితం చేసిందో తెలిసిన విషయమే. ఏ పని చేయాలన్నా ఆన్‌లైన్‌లోనే.. లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను చాలా మిస్ అయ్యాం. అందుకే.. నాకు కూడా ఆ టీవీ స్క్రీన్‌లో నుంచి లోపలికి వెళ్లి.. స్క్రీన్‌లో నుంచి కాకుండా రియాల్టీని ఎంజాయ్ చేయాలని ఉంది.. అంటూ ట్వీట్ చేశారు.
0 Comments