ఈరోజు బంగారం ధర రూ.400కి పైగా తగ్గింది. వచ్చే ఏడాది నాటికి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తన నెలవారీ బాండ్ కొనుగోళ్లను సడలించినట్లు పేర్కొన్న తర్వాత భారతదేశంలో బంగారం ధర భారీగా పడిపోయింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర సెప్టెంబర్ 23న 0.62 శాతం క్షీణించి రూ.46,383కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో యుఎస్ ఫెడ్ ఊహించిన దానికంటే త్వరగా వడ్డీ రేటు పెంపును ప్రకటించడంతో బంగారం ధర పడిపోయింది. న్యూఢిల్లీలో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి సుమారు రూ.400లు తగ్గడంతో రూ.46,468కి చేరింది. అలాగే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.42,934 నుంచి రూ.42,565కు తగ్గింది. మరోవైపు, వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. కిలో వెండి ధర రూ.600లు తగ్గడంతో ప్రస్తుతం మొత్తం ధర రూ.60,362కి చేరింది. నిన్నటి ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.60,954లుగా ఉంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర దాదాపు రూ.47,840ల నుంచి రూ.47,560కు పడిపోయింది. బంగారం, వెండి ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి వివిధ అంశాల చేత ప్రభావం చెందుతాయి.
0 Comments